English
గౌరవనీయులైన సభ్యులకు ది 30-06-2016 న 11 మంది సభ్యులతో / కార్యవర్గ సభ్యులతో కమ్మ వారి సేవ సమితి గ్రేటర్ విజయవాడ పేరుతో సంస్థకు బైలాలను తాయారు చేసుకొని ది 04-07-2016 న విజయవాడ లో నెంబర్ 165/2016 గా రిజిస్ట్రేషన్ చేయించడమైనది . తదుపరి సేవాసమితి సభ్యుల విశేష కృషి తో ఇప్పటికీ 1082 మందిని జీవిత సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది.ది 03-04-2016 మరియు 10-04-2017తేదీలలో నిర్వహించిన కార్యవర్గాన్ని పునర్వేవస్తీకరించి, 24 మందితో కార్యవర్గాన్ని విస్తరించుట జరిగింది.
2016 సంవత్సరములో మన సేవా సమితి సభ్యులు వనం-మనం కార్యక్రమంలో భాగంగా T.T.D. కల్యాణ మండపం నుండి రేడియో స్టేషన్ వరకు మొక్కలు నాటం. 2017 జనవరి 8 న సంక్రాంతి సంబరాలు పేరుతో ధనేకుల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో కమ్మవారి కొరుకు నిర్వహించిన కార్యక్రమానికి ౭౦౦౦ మందికి పైగా కమ్మవారు హాజరైనారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేస్గ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు గారు ముఖ్య అతిధి గా శ్రీ చేకూరి కాశయ్య , కలైమామణి డాక్టర్ ఆర్.బి.న్. ప్రత్యేక అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమములో కమ్మ ప్రముఖుల క్యాలెండరు ఆవిష్కరణ వివిధ రంగాలలో అత్యున్నత శిఖరాలను అధిష్టించిన ప్రముఖులైన కమ్మవారు పద్మశ్రీ గుత్తా మునిరత్నం, డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, శ్రీ నెక్కంటి వెంకట సుబ్బారావు, శ్రీ కర్నాటి లక్ష్మీ నరసయ్య , ఆవుల మంజులత, శ్రీ పండా శివలింగ ప్రసాద్ , కుమారి వెన్నం జ్యోతి సురేఖ గార్లను సన్మానించుకొన్నాము.

Vidyalaya – HOSTEL
హాస్టల్
ఒక మహోన్నత ఆశయంతో మన సభ్యులు, దాతల సహకారంతో పెనమలూరు గ్రామంలో 2017, జూన్ 12న కమ్మవారిలో అత్యంత పేదరికంలో ఉన్న బాలికలకు ఉచిత విద్యను అందించాలనే లశ్యంతో, అద్దె గృహంలో ‘విద్యాలయ’ వసతి గృహాన్ని ఎర్ప్రాటు చేయడం జరిగింది. మన ఉభయ తెలుగు రస్త్రాలలో పేదరికంలో ఉన్న తలిదండ్రులు లేని / తల్లి గాని తండ్రి గారి లేని కమ్మవారి ఆడపిల్లలను వారి స్వభావం అధారంగా ఎంపిక చేసి వారిని పెనమలూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో ఏడవ తరగతిలో చేర్పించుతున్నాము. విద్యార్ది జీవితంలో ఏడు నుండి పదవ తరగతి వరకు అత్యంత కీలకమైన సమయం, అపుడు నేర్చుకునే విజ్యానమే భవిష్యత్తుకు పునాది అందుచేతనే మనం ఏడవ తరగతిలో విద్యార్డులను చేర్చుకొని వారిని విద్యా పరంగానే కాకుండా, ఆరోగ్యపరంగా నైతికపరంగా కూడా తీర్చిదిద్ది మంచి వ్యక్తిత్వంతో మన విద్యాలయ నుండి వారిని ఉన్నత విద్యకు పంపాలనేది మన ఆశయం.
ఏపి డిపార్ట్మెంట్ ఆఫ్ జువెనైల్ వెల్ఫైర్ వారి సకల నిబంధనలకు లోబడి మన హాస్టల్ నిర్వహణ కొనసాగించడం వల్ల రిజిస్ట్రేషన్ నెo: 125/ఎఫ్ఆర్సి/కేఆర్ఐ/18 ద్వారా 30/10/2018 నుండి 2/10/2023 అనుమతులు మంజూరయ్యాయి .కృష్ణాజిల్లాలో ఉన్న దాదాపు 120 చైల్డ్ కేర్ సెంటర్లలో మన విద్యాలయను నిర్వాహిస్తున్న విధానం,భోధనా పద్ధతులను అధికారులు ప్రశంసిం చడమే కాకుండా మన “విద్యాలయ” ను ఒక “రోల్ మోడల్ ” గా ఇతరు లకు చూపడం మన అందరికి గర్వకారణం.