కమ్మ వారి సేవా సమితి గౌరవ సభ్యులకు, దాతలకు వందనములు
శ్రీ దండమూడి విష్ణువర్ధన రావు గారు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, మారేడు మాక గ్రామ వాస్థవ్యులు, వీరు ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్.ఎస్.సి న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఉత్తీర్ణులై ఆ తరువాత అమెరికా వెళ్లి అక్కడ డాక్టరేట్ చేసి న్యూజెర్సి మెడికల్ స్కూల్ లో రేడియాలజీ హెడ్ గా పని చేసి ఇటీవలే రిటైర్ అయినారు. వీరు మన సంఘ కోశాధికారి, మారేడు మాక వాస్తవ్యు లైన శ్రీ కోనేరు రామారావు గారి ద్వారా మన సంఘ కార్యకలాపాల గురించి, పెనమలూరు గ్రామ ములో మనం నిర్మించిన భవనం, దానిలోని పేద కమ్మ వారి బాలికలకు విద్య వసతి మొదలైన విషయములు తెలుసుకుని మిక్కిలి సంతోషించి మారేడు మాక గ్రామం లోని తనకు చెందిన ఎ. 1..30 సెం. లు (షుమారు 40 లక్షలు) కమ్మ వారి సేవా సమితి కి గిఫ్ట్ డీడ్ ద్వారా దానము చేసినారు. ఆ స్థలములో ఓల్డ్ ఏజ్ హామ్ గాని, హాస్పిటల్ గాని లేదా విద్యా సంస్థలు గాని నిర్మించి సదరు ఆవరణకు తన తల్లి దండ్రుల పేరు పెట్టే విధముగా మన సంఘమునకు దానము చేసారు.
వీరు గతంలో 1996 లో కృష్ణాజిల్లా , గోసాల గ్రామం లో తన మాతృమూర్తి శ్రీ మతి దండమూడి సరోజినిదేవి పేరిట ఓ అనాధ ఆశ్రయము నిర్మించి ఇవ్వగా దానిని విజయవాడ, వాసవ్య మహిళా మండలి వారు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన స్వగ్రామం మారేడు మాకలో ఉన్నత శ్రేణి లో ఉర్తీర్ణులైన విద్యార్థులకు తన తల్లి తండ్రుల పేరిట స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు సిద్దార్ద కమిటి కమ్మ విద్యార్థి సహాయ సంఘము వారికి 3 లక్షలు విరాళము ఇచ్చినారు. అమెరికా లో విద్య పొందే ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక సహాయము చేసినారు.
విష్ణువర్థన రావు గారి లాంటి సహృదయుల అండ మన కమ్మ వారి సేవా సమితి కి లభించటం ఎంతో హర్షించ దగ్గ పరిణామం.భవిష్యత్ లో మరింత సహాయ సహకారములు అందచేస్తానని హామి ఇచ్చిన శ్రీ దండమూడి విష్ణువర్ధనరావు గారికి కమ్మవారి సేవాసమితి, గ్రేటర్ విజయవాడ తరఫున కృతజ్నతాభినందనలు
Read more