Photo Gallery

శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారు

ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి శ్రీమతి నళిని గారితో కలసి మన "విద్యాలయ" హాస్టల్ భవనానికి విచ్చేసారు. వారిని మన పాలకవర్గ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మండవ గారు హాస్టల్ లో ఉన్న విద్యార్థినులతో మాట్లాడి .. వారికి అనేక విషయాలలో మార్గదర్శనం చేశారు. కమ్మవారి సేవాసమితి కార్యకలాపాల గురించి, 'విద్యాలయ' గురించి వారికి వివరించడం జరిగింది. సంస్థ పనితీరును మెచ్చుకుని అన్ని విధాలుగా అండ దండలుగా ఉంటామని ప్రోత్సహం ఇచ్చిన మండవ దంపతులకు కమ్మవారి సేవాసమితి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు