HOSTEL

HOSTEL

హాస్టల్ ప్రవేశ విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నీ ప్రాంతములకు చెందిన, ఆర్ధికంగా వెనుకబడిన / తల్లిగాని, తండ్రిగాని లేని కమ్మవారి కుటుంబాలకు చెందిన విద్యార్దినులు ప్రవేశానికి అర్హులు. ప్రవేశం కోసం అప్లికేషన్ ఇచ్చిన విధ్యార్దినులను వారి స్వభావం ఆధారంగా ఎంపిక చేసి వారిని పెనుమలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతిలో చేర్పించుతునాము.

7వ తరగతి నుండే ఎందుకు?

విద్యలో నాణ్యత(క్వాలిటి) కరువైన నేటి విద్యా విధానంలో మన పిల్లలకు అత్యుత్తమైన విద్యను అందించడానికి మన సంఘ సభ్యులు, పెద్ధాలు తాతినేని విద్యాసాగర్ గారి దర్శినికతతోో ఒక సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించి అవలంభిస్తున్నాము. విద్యార్ది జీవితంలో ఏడు నుండి పదవ తరగతి వరకు అత్యంత కీలకమైన సమయం. అప్పుడు నేర్చుకునే విజ్యానమే భవిష్యత్తుకు పునాది. అందుచేతనే మనం ఏడవ తరగతిలోనే విద్యార్తులను చేర్చుకుని, వారిని విద్యాపరంగానే కాకుండా మంచి వ్యక్తిత్వ వికాసం కల వ్యక్తులుగా తీర్చిడిదలనేది మన ఆశయం.