22.02.2017 న నిర్మలా శిశు విద్యా భవన్ వారికి షెడ్ నిర్మాణం కొరకు Rs.47000/-చెక్ ద్వారా అందచేశాము. 19.03.2017 న ఉయ్యురు రోటరీ నేత్ర వైద్యశాల , ఎం ఎల్ ఏ గద్దె రామ మోహన్ గారి సహకారంతో విజయవాడ రామలింగేశ్వర నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. 550 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి , 45 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్స్ చేయించాము. 200 మందికి మందులు, 15 మందికి కళ్ళ జోళ్ళు అందజేశాము.
04-07-2017 ఆదివారం అమ్మ ఫంక్షన్ హాల్ విజయవాడ నందు జరిగిన ప్రధమ వార్షిక సర్వసభ్య సమావేశం లో మన సంఘ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భం గా వారిని సన్మానించారు.
జనవరి 2017లో నిర్వహించిన విధానం గానే తిరిగి జనవరి 07, 2018 లో కూడా గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల మరియు సాంకేతిక ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి గ్రామీణ వాతావరణంలో అనేక కార్య క్రమాలు నిర్వహించడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ శ్రీ కె వి చౌదరి ముక్య అతిధి గా , కోయంబత్తూరు ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ భక్తవత్సలం , శ్రీ మాగంటి మురళీ మోహన్ , కలైలామణి డాక్టర్ ఆర్ బి ఎన్ అతిధులుగా జరిగిన సభలో వివిధ రంగాలలో ప్రఖ్యాతి గాంచారు.గాంచిన కమ్మ ప్రముఖులు శ్రీమతి దీపా వెంకట్ , పద్మశ్రీ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోకెలే , శ్రీ సజ్జ కిషోర్ బాబు , శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు , చెస్ గ్రాండ్ మాస్టర్ చి.ముసునూరి లలిత్ బాబు లను సన్మానించుకొన్నాము. పది వేల మంది పైగా కమ్మ సోదరులు హాజరైన ఈ కార్యక్రమములో విఖ్యాతి గాంచిన కమ్మ ప్రముఖుల చిత్రాలతో కూడిన పంచాంగం ఆవిష్కరణ , ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు , ఎడ్ల ప్రదర్శన, గంగిరెద్దుల ఆటలు , కోడి పందేలు , గొర్రె పొట్టేళ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా అలరించాయి.
కమ్మవారిలో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని బాలికలకుమన సంఘం తరుపున ఉచ్ఛితంగా విద్యా బోధన గారపి ఉన్న విద్యావంతులను చేస్తే వారి వల్ల ఆయా కుటుంబాలు స్థితిగతులు వృద్ధి చెందుతాయని ,తద్వార మన సామాజికుల పురోగతికి దోహదపడ్డవచ్చు అనే ఆలోచనతో , మన సంఘ సభ్యులు సభ్యులు , దాతల సహకారంతో షుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో జూన్ 12, 2017 నా పెనమలూరు గ్రామంలో అద్దే గృహంలో విద్యా బాలికల వసతి గృహం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రతి ఏడాది 25 కమ్మ బాలికలను 7వ తరగతి లో చేర్చి వారికి విద్యాలయంలో ఆశ్రయం కల్పించాలి అనేది మన ఉద్దేశం, అంటే 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు (6 సంవత్సరములు) మన హాస్టల్ లో దాదాపు 160 మందికి వసతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది.